తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Bigg Boss Finale: నేడే ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 8’ గ్రాండ్‌ ఫినాలే.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బుల్లితెర ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ – 8 గ్రాండ్ ఫినాలే ఇవాళ సాయంత్రం జరగనుంది. వంద రోజులకు పైగా ప్రేక్షకులకు వినోదం అందించిన ఈ షో ముగింపు దశకు చేరుకుంది. స్టార్ మా ఛానల్‌లో సాయంత్రం గ్రాండ్ ఫినాలే ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన తాజాగా ప్రోమో విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో పాల్గొని ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ అందరూ ఫినాలేలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

టాప్ 5లో ఉన్నది వీరే!

ఇక బిగ్‌బాస్ టైటిల్ పోరులో టాప్ 5లో మొత్తం ఐదుగురు నిలిచారు. వారిలో నిఖిల్‌, గౌతమ్‌, ప్రేరణ, నబీల్‌, అవినాష్‌ ఉన్నారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారన్న ఆసక్తికరంగా మారింది. మరోవైపు గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌ ప్రైజ్‌మనీని పెంచారు. విజేతకు రూ. 54,99,999 అని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. గెలిచిన విజేతకు టైటిల్‌తోపాటు ఈ క్యాష్‌ ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాదు, స్విఫ్ట్ కారును కూడా బహుమతిగా అందించనున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button