తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Chaithu – Shobhita: నాగచైతన్య – శోభిత పెళ్లి డేట్‌ ఫిక్స్‌?

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగచైతన్య.. నటి శోభితా ధూళిపాళ్లతో ఏడడుగులు వేయబోతున్నారు. ఇటీవలే ఆగస్ట్ 8న వీరి నిశ్చితార్థం కూడా పూర్తయిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి డేట్‌ ఫిక్స్‌ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. డిసెంబర్‌ 4న వీరు వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నట్లు టాలీవుడ్‌‌లో టాక్ వినిపిస్తోంది.

పెళ్లి ఎక్కడ?

ఇక, డిసెంబర్‌ 2వ తేదీన సంగీత్‌, మూడో తేదీన మెహందీ, నాలుగో తేదీన పెళ్లి జరగనున్నట్లు తెలిసింది. డిసెంబర్‌ 10న గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేసినట్లు టాక్‌. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన అక్కినేని నాగేశ్వరరావు నేషనల్‌ అవార్డ్స్‌ 2024 వేడుకలో ఈ విషయం బయటకు వచ్చినట్లు సమాచారం. పెళ్లి తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పెళ్లికి అతి తక్కువ మందిని మాత్రమే పిలబోతున్నట్లు సమాచారం. అయితే, వీరు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకుంటారా..? లేక హైదరాబాద్‌లోనే చేసుకుంటారా..? అన్నది ఇంకా తెలీదు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button