Chaithu-Shobitha: చైతూతో ప్రేమ ప్రయాణంపై.. శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు!
అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత జంట ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో వీరిద్దరూ వారి పరిచయం, ప్రేమ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగానే చైతూతో ప్రేమ ప్రయాణంపై శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గోవాలో పెళ్లి ప్రతిపాదన
మొదటిసారి ముంబైలోని ఓ కేఫ్‌లో చైతన్యను కలిసినట్లు శోభిత చెప్పారు. ‘అప్పుడు చైతన్య హైదరాబాద్, నేను ముంబైలో ఉండేవాళ్లం. నా కోసం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవారు. మొదటిసారి మేం బయటకు వెళ్లినప్పుడు నేను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్‌లో ఉన్నాడు. ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్లాం. అక్కడ కొంత సమయం గడిపాం. ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాం. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌కు వెళ్లాం. అప్పటినుంచి జరిగినదంతా అందరికీ తెలిసిన విషయమే.’ అని అన్నారు. నాగచైతన్య కుటుంబం నూతన సంవత్సర వేడుకలకు తనను ఆహ్వానించినట్లు శోభిత తెలిపారు. ఆ మరుసటి సంవత్సరం తన కుటుంబాన్ని చైతన్య కలిసినట్లు చెప్పారు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలిపారు.