Collection King: నాని సినిమాలో విలన్‌గా కనిపించనున్న కలెక్షన్ కింగ్?
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీలో ధరణి పాత్రలో నాని చేసిన మాస్ యాక్షన్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరి కాంబోలోనే తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. హింస, రక్తపాతం, తుపాకులు. గ్లోరీ, ఒక మనిషి.. అంటూ ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో నాని హై ఎనర్జిటిక్ యాక్షన్ ప్యాక్‌డ్ రోల్‌లో కనిపించబోతున్నారట.
క్రేజీ కాంబో!
అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. టాలీవుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇందులో విలన్ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే మోహన్ బాబు.. నానికి విలన్‌గా నటిస్తే స్క్రీన్‌పై కాంబో అదుర్సో అదుర్స్. అంతేకాదు మరో పాపులర్ తెలుగు యాక్టర్ కూడా ఇందులో కీ రోల్‌లో నటిస్తున్నాడని ఇన్‌సైడ్ టాక్. ఇంతకీ ఎవరా నటుడనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది.