
Colors Swathi: మళ్లీ తెరపైకి కలర్స్ స్వాతి విడాకుల ఇష్యూ..!
టాలీవుడ్ హీరోయిన్ కలర్స్ స్వాతి విడాకుల ఇష్యూ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2018లో తన బాయ్‌ఫ్రెండ్ వికాస్ వాసుని కలర్స్ స్వాతి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ.. తన పూర్తి సమయాన్ని ఫ్యామిలీ లైఫ్‌పై కేటాయింది స్వాతి. అయితే తాజాగా స్వాతి తన సోషల్ అకౌంట్‌లో భర్తకు సంబంధించిన ఫొటోలను డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో స్వాతి-వికాస్ విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా గతంలో కూడా వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. వాటిని స్వాతి ఖండించిన విషయం తెలిసిందే.
యాంకర్ నుంచి హీరోయిన్‌గా..!
‘కలర్స్’ అనే టీవీ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న స్వాతి తర్వాత సినిమాల్లోకి ప్రవేశించింది. మొదట బాల నటిగా కనిపించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘అష్టాచమ్మా’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నిఖిల్ సిద్ధార్థ్‌తో స్వామిరారా, కార్తికేయ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత స్వాతి కెరీర్ కొంచెం స్లో అయ్యింది. 2018లో వికాస్‌తో పెళ్లి తర్వాత సినిమాకు దూరంగా ఉంటోంది. చాలా గ్యాప్ తరువాత ఇటీవలే ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘మంత్ ఆఫ్ మధు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.