తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Daaku Maharaj: మనిషి కాదు, వైల్డ్ యానిమల్.. అదరగొట్టిన ‘డాకు మహారాజ్’ రిలీజ్ ట్రైలర్!

బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా మేకర్స్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. మూవీ నుంచి కాసేపటి క్రితమే రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. బాలయ్య ఫ్యాన్స్‌కి ఈ ట్రైలర్ ఐ ఫీస్ట్‌లా ఉంది.

గూస్‌బంప్స్ తెప్పించే డైలాగ్స్!

మొదటి ట్రైలర్ కంటే ఈ ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ఇక, ఈ ట్రైలర్ చూసిన బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వాడి ఒంటి మీద 16 కత్తిపోట్లు ఒక బుల్లెట్ గాయం అయినా కింద పడకుండా అంతమందిని నరికాడంటే అతను మనిషి కాదు వైల్డ్ యానిమల్, నాకు శత్రువులు తక్కువ, ప్రాణమిచ్చే అభిమానులు ఎక్కువ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో నేను మర్డర్స్‌లో మాస్టర్ చేశా.. అంటూ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెపిస్తాయి. తమన్ అదిరిపోయే బీజీఎం అందించారు. ఈ కొత్త ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచిందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button