తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Daaku Maharaj: ‘డాకు మహారాజ్’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే..?

బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా నిన్న రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, బాలయ్య యాక్షన్, డైలాగ్స్, బీజీఎం ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. దీంతో ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.56 కోట్ల వసూళ్లు సాధించినట్టు మూవీ టీం ప్రకటించింది. అంతేకాదు, బాలకృష్ణకు ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని పేర్కొంది.

మరోసారి 1 మిలియన్ డాలర్ మార్క్!

ఇక, యూఎస్‌లో మొదటి రోజు వసూళ్లతోనే 1 మిలియన్ డాలర్ మార్క్‌ని అందుకున్నారు బాలకృష్ణ. బాలయ్యకి ఇది వరుసగా నాలుగో 1 మిలియన్ డాలర్ మూవీ. ఓవరాల్‌గా ఐదోది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తర్వాత ‘అఖండ’, ‘వీరసింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’, తాజాగా ‘డాకు మహారాజ్’ సినిమాలతో ఐదు సార్లు 1 మిలియన్ డాలర్లను తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 17న సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ టీం సన్నహాలు చేస్తోంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button