Devara: ‘దేవర’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘దేవర’. దసరా కానుకగా సెప్టెంబర్ 27న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్నో సరికొత్త రికార్డులు సృష్టించింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఎన్నో రోజుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. ఈవిషయాన్ని ఆ ఓటీటీ సంస్థ తెలిపింది. నవంబర్ 8 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది.
పార్ట్ – 2పై భారీ అంచనాలు
ఇక ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. తంగం అనే పాత్రలో ఆమె ఒదిగిపోయారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించారు. ఎన్టీఆర్ డ్యుయల్ రోల్లో కనిపించి అభిమానులను అలరించారు. వీరితో పాటు శ్రీకాంత్, మరాఠి స్టార్ శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనిరుధ్ సంగీతం అందించారు. యువసుధ, ఎన్టీఆర్ బ్యానర్లపై దేవర సినిమా తెరకెక్కింది. దేవర-1 భారీ హిట్ అవ్వడం వల్ల దాని సీక్వెల్‌పై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.