తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Devara: ఓటీటీలోనూ ‘దేవర’ రికార్డుల మోత!

ది మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న దసరా కానుకగా వచ్చి బాక్సీఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేసిందో చూశాం. ఏకంగా రూ. 500 కోట్ల క్లబ్ లోకి సైతం చేరి బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దులు కొట్టింది. ఇప్పటికే చాలా థియేటర్లలో ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే కేవలం థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ ఈ మూవీ రికార్డులు సృష్టిస్తోంది.

‘దేవర’ @ నంబర్ వన్

‘దేవర’ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చింది. నవంబర్ 8న డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘దేవర’కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మిలియన్లలో వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తోంది. తాజగా ఈ వీక్ ఇండియా టాప్ టెన్ సినిమాల లిస్ట్ విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. ఓటీటీలో రిలీజ్ అయిన నాటి నుండి ఇప్పటి వరకు నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతూ టాప్‌లో సాగుతోంది. థియేటర్లలో ఎన్నో రికార్డులు సృష్టించి ఇప్పుడు ఓటీటీలోను రికార్డు వ్యూస్ తెచ్చుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button