Devara: ‘దేవర’… ట్రైలర్ మారింది.. మరి మూడ్ మారిందా?
జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘దేవర’. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్‌లో మిలియన్స్ వ్యూస్ సాధిస్తున్నాయి. ఇటీవల ట్రైలర్ సైతం విడుదల అయ్యింది. కానీ ఆ ట్రైలర్ ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో లేదని భావించిన మేకర్స్ ఇవాళ తాజాగా ‘రిలీజ్ ట్రైలర్’ను విడుదల చేశారు.
తేడా ఏంటంటే?
అయితే, రెండో ట్రైలర్ కాస్త డిఫరెంట్‌గా వస్తుందని అనుకున్నారు చాలా మంది. కానీ రిలీజ్ ట్రైలర్ కూడా మొదటి ట్రైలర్ ఛాయల్లోనే వచ్చింది. సముద్రం ఎరుపెక్కడం, ఆయుధాలు, నరుక్కోవడం… ఇలా మొదటి ట్రైలర్‌లో చూపించిన ఎలిమెంట్స్ అన్నీ.. తాజా రిలీజ్ ట్రైలర్‌లో కూడా ఉన్నాయి. కాకపోతే సన్నివేశాలు మారాయి అంతే. మొదటి ట్రైలర్‌తో పోలిస్తే, రెండో ట్రైలర్ లో ఓ ప్రత్యేకత ఉంది. ఫస్ట్ ట్రైలర్‌లో ఎక్కువగా యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే చూపించగా.. రెండో ట్రైలర్‌లో ఎమోషనల్ కంటెంట్ కూడా చూపించారు. మరీ ముఖ్యంగా దేవర కనిపించకుండా పోయాడనే విషయాన్ని మొదటి ట్రైలర్ చెప్పగా.. కీలకమైన టైమ్‌లో దేవర తిరిగొచ్చినట్టు రెండో ట్రైలర్‌లో చూపించారు.