తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Devara: దుమ్ములేపిన ‘దేవర’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

జూ. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘దేవర’ సినిమా విడుదలకు ముందే ఎన్నో రికార్డులు సృష్టించింది. విడుదల తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుందని అందరూ భావించారు. అనుకున్న విధంగానే ‘దేవర’ నిన్న విడుదలైన మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ అందుకుంది. అదే స్థాయిలో రివ్యూస్ కూడా వచ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ యాక్టింగ్, డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ 20 నిమిషాలు, యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. చాలా కాలం తర్వాత మరోసారి తారక్ తన మాస్ నట విశ్వరూపం చూపించాడని ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.

అదిరిపోయే కలెక్షన్స్!

ఇక, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు అద్బుతమైన కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండియాలో తొలి రోజున దేవర సినిమాకు రూ. 77 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ ఇచ్చాయి. ఇందులో తెలుగు నుంచి రూ.68.6 కోట్లు, హిందీ నుంచి రూ.7 కోట్లు, కన్నడ నుంచి రూ. 30 లక్షలు, తమిళం ద్వారా రూ. 80 లక్షలు, మళయాళం వెర్షన్‌లో రూ. 30 లక్షలు వచ్చాయి. అలాగే, నిన్న ఒక్కరోజే 79.56 శాతం తెలుగులో థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు పేర్కొన్నారు. అలాగే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 172 కోట్ల గ్రాస్ కలెక్షనన్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా.. ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని నిర్మించారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button