Devara: ‘దేవర’ ప్రభంజనం.. ప్రభాస్, మహేష్‌బాబు రికార్డులు గల్లంతు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘దేవర’ మూవీ విడుదలకు ముందే ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ మూవీ దుమ్ము లేపుతున్న విషయం తెలిసిందే.. ఇక, ఏ సినిమాకైనా, ఏ హీరోకైనా ఎన్ని రికార్డులు సాధించినా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో రికార్డు నెలకొల్పితే మాత్రం అది ఎంతో ప్రత్యేకం. అలాంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో దేవర దెబ్బకు ప్రభాస్, మహేష్ బాబు రికార్డులు గల్లంతయ్యాయి.
సరికొత్త రికార్డు!
ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోనే సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ రోజున మొత్తం 46 షోలు వేయబోతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న అన్ని థియేటర్లలో ఏడు షోలు వేయనున్నారు. దీనికి సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా నిముషాల్లో అయిపోయాయి. ఇక, మొదటి రోజు ఇక్కడ అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ప్రభాస్ కల్కి నిలిచింది. ఈ సినిమా రూ. 87 లక్షలు సాధించింది. రెండో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ నిలిచింది. ఈ సినిమా మొదటిరోజు రూ. 82 లక్షలు రాబట్టగా, ఆర్ఆర్ఆర్ రూ.76 కోట్లు రాబట్టింది.
రూ. 1.25 కోట్ల కలెక్షన్లు?
అయితే దేవరకు ప్రస్తుతం ఉన్న ట్రెండ్, ఆ సినిమా పట్ల ఉన్న మ్యానియా చూస్తుంటే ఈ రికార్డులను బద్ధలు కొట్టడం సులువనిపిస్తోంది. టికెట్లన్నీ అయిపోవడంతో దాదాపుగా మొదటిరోజు ఈ సినిమా రూ.1.25 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మొదటిరోజు ఇంత సాధించడం అంటే చరిత్రలోనే మొదటిసారి అవుతుంది. రూ.1.25 కోట్లు అందుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కొత్త చరిత్ర సృష్టించినవారవుతారు.