Devara Trailer: ధైర్యాన్ని చంపే భయం ‘దేవర’.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్!
రెండు తెలుగు రాష్ట్రాలను ఇప్పటికే ‘దేవర’ ఫీవర్ కమ్మేసింది. ‘ఫియర్ సాంగ్’తో ఫియర్ పుట్టించిన అనిరుధ్.. ‘చుట్టమల్లే సాంగ్’తో ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లిపోయాడు. ఇక, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఈ చిత్రంలో తారక్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు ట్రైలర్‌తో అర్థమైపోతోంది. ఎన్టీఆర్ నటన, డైలాగ్స్ అదుర్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. జాన్వీ లుక్స్ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. సైఫ్ అలీ ఖాన్ విలనిజం అయితే ఓ రేంజ్‌లో కనిపిస్తోంది.
Also Read: ‘దేవర’కు సూపర్ క్రేజ్.. రిలీజ్‌కు ముందే రికార్డులు!
ఈ మూవీతో కొరటాల శివ ఖాతాలో మరో సూపర్ హిట్ ఖాయమని ట్రైలర్ చూసినవాళ్లు చెబుతున్నారు. ఇక ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ సమర్పణలో హరికృష్ణ, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు ఓవర్సీస్‌లో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేశారు మేకర్స్. అటు అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేశారో లేదో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ప్రీసేల్‌లో ఏకంగా 1 మిలియన్ టికెట్లు బుక్ చేసి రికార్డు సృష్టించింది.