తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Devara: ‘దేవర’ కలెక్షన్ల సునామీ.. పది రోజుల్లో రూ. 466 కోట్లు!

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఖాతాలో దేవ‌ర రూపంలో మ‌రో బ్లాక్ బస్టర్ హిట్ వ‌చ్చి ప‌డింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా విడుదలై ఇవాళ్టితో పది రోజులు ముగిసింది. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా జనాల్లోకి ఈ సినిమా ఎక్కేసింది. ఇప్పటికే ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌ని పూర్తిచేసుకుని సక్సెస్ సెలబ్రేషన్స్‌ స్టార్ట్ చేసేసింది.

త్వరలో రూ. 500 కోట్ల క్లబ్‌లోకి..

ఇక తాజాగా పది రోజుల్లో దేవర మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్‌ని కొల్లగొట్టిందో మేకర్స్ అఫిషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పది రోజుల్లో రూ. 466 కోట్ల వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. దసరా సెలవులు కూడా కలిసి రావడంతో ఇక మరో రెండు మూడు రోజుల్లో రూ. 500 కోట్ల క్లబ్‌లో కూడా ఈ మూవీ చేరుతుందని భావిస్తున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button