తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Dil Raju: సినీ ఇండస్ట్రీలో ఎవరూ ఎవరికీ సపోర్ట్‌ చేయరు.. నిర్మాత దిల్‌ రాజు షాకింగ్ కామెంట్స్!

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో ఎవరూ ఎవరికీ సాయం చేయరన్నారు. మనల్ని మనమే నిరూపించుకోవాలని చెప్పారు. ‘ఇటీవల ‘క’ ప్రెస్‌మీట్‌లో కిరణ్‌ అబ్బవరం చేసిన వ్యాఖ్యలు విన్నా. అదే విధంగా నిన్న ఒక హీరో కూడా సెలబ్రిటీలు ఎవరూ తమ చిత్రాన్ని సపోర్ట్‌ చేయడానికి రావడం లేదన్నాడు. చిత్ర పరిశ్రమలో మిమ్మల్ని మీరే నిరూపించుకోవాలి. ఎవరో ఏదో అన్నారని భయపడకూడదు. టాలెంట్‌ ఉంటే తప్పకుండా సక్సెస్‌ అవుతారు. ఇక్కడ కేవలం టాలెంట్‌కే పెద్ద పీట’ అని అన్నారు. టాలీవుడ్ హీరో రాకేశ్ వర్రేను ఉద్దేశించి దిల్ రాజు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

సెలబ్రిటీలు వచ్చారా? రాలేదా? అన్నది పాయింట్ కాదు!

అయితే, రాకేశ్ వర్రే తాజాగా నటించిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. ఉమ్మడి జగిత్యాల జిల్లాకు చెందిన అప్పటి ఏబీవీపీ దివంగత నేత జితేందర్ రెడ్డి బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో రాకేశ్ మాట్లాడుతూ తమ సినిమాను ప్రమోట్ చేసేందుకు సెలబ్రిటీస్ ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. ఒక సినిమా తీయడం ఎంత కష్టమో సెలబ్రిటీలను ప్రమోషనల్ ఈవెంట్స్‌కు తీసుకురావడం అంతే కష్టమని చెప్పాడు. దీనిపై దిల్ రాజు గట్టిగానే స్పందించారు. ‘అసలు సెలబ్రిటీలు వచ్చారా? రాలేదా? అన్నది పాయింట్ కాదు. నువ్వు ఎలా నీ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకువెళ్లావు అనేదే పాయింట్. ఎలా అయినా సరే మంచి కంటెంట్‌తో వచ్చి ప్రేక్షకులను అలరించాలి కానీ ఏవో అంచనాలు పెట్టుకుని సినిమాలు చేయొద్దు.’ అని అన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button