తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Gaami: శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ‘గామి’ హీరో

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘గామి’. ఈ మూవీలో చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌’ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇటీవల గ్లింప్స్, టీజ‌ర్‌తో పాటు ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ALSO READ: మార్చి 15 నుంచి ఓటీటీలోకి ‘ఊరు పేరు భైరవకోన’?

‘శివ‌మ్’ పాట‌ రిలీజ్..

‘గామి’ విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ వేగం పెంచారు. ఇందులో భాగంగా న‌టుడు విశ్వ‌క్ సేన్ శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. సోమ‌వారం ఉద‌యం ఆలయం వద్దకు చేరుకున్న విశ్వ‌క్ సేన్‌కు ఆల‌య అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, ‘గామి’ సినిమా నుంచి ‘శివ‌మ్’ అనే పాట‌ను ఈరోజు సాయంత్రం 4:05 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేకర్స్ తెలిపారు. ఇక మార్చి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button