తెలుగు
te తెలుగు en English
Linkin Bioటాలీవుడ్

‘Game Changer’ Collections: రూ. 100 కోట్ల తేడానా..! ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ డే కలెక్షన్స్‌ నిజమేనా..?

‘గేమ్ ఛేంజర్’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ. 186 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే ఈ కలెక్షన్లు నిజం కాదని, సినిమా మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే ఈ స్థాయిలో కలెక్షన్లు ఎలా వస్తాయని ట్రోలింగ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కోసమే మేకర్స ఫేక్ ఫిగర్స్‌ను రిలీజ్ చేశారని ఆరోపిస్తున్నారు.

బాక్సాఫీస్ ట్రాకర్స్ అంచనా రూ. 85 కోట్లే!

బాక్సాఫీస్ ట్రాకర్స్ ప్రకారం ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు సుమారు రూ. 85 కోట్లుగా అంచనా వేశారు. కానీ మేకర్స్ మాత్రం తమ పోస్టర్ ద్వారా మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు రూ. 185 కోట్లుగా ప్రకటించారు. ఏకంగా 100 కోట్ల భారీ తేడా సినీ ప్రేమికులను, ట్రేడ్ వర్గాలను ఆలోచింపజేస్తోంది. ట్రాకర్స్, మేకర్స్ మధ్య ఇంత పెద్ద డిఫరెన్స్ ఎందుకు వచ్చిందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే, వీకెండ్ బుకింగ్స్‌ను బట్టి సినిమా అసలు ఫలితంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘దేవర’ మొదటి రోజు కలెక్షన్లు రూ. 172 కోట్లను దాటేయడం ప్రశ్నలకు తావిస్తోంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button