తెలుగు
te తెలుగు en English
Linkin Bioటాలీవుడ్
Trending

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు చరణ్ ఫస్ట్ చాయిస్ కాదా? ముందు అనుకున్న హీరో ఎవరంటే..?

రామ్ చరణ్ హీరోగా తమిళ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదలకు సిద్ధమైపోయింది. ఈ క్రమంలో ఇవాళ ఏపీలోని రాజమండ్రిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ సోలోగా నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.

2021లోనే ప్రారంభం..

ఈ సినిమాకు డైరెక్టర్ శంకర్‌కి.. రామ్ చరణ్ ఫస్ట్ చాయిస్ కాదట. ముందు ఈ సినిమా కోసం వేరే హీరోని అనుకున్నారట. ఈ స్క్రిప్ట్‌ని డైరెక్టర్ శంకర్ ముందు దళపతి విజయ్‌కి వినిపించారట. ఆయనకు కథ బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పేశారట. అయితే ఈ సినిమా కోసం ఏడాదిన్న కాల్షీట్స్ కావాలని కండిషన్ పెట్టారట దర్శకుడు. కానీ అప్పటికే రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్న విజయ్.. తాను కేవలం ఏడాది మాత్రమే అడ్జెస్ట్ చేయగలనని చెప్పారట. దీంతో డైరెక్టర్ శంకర్.. రామ్ చరణ్‌కి కథ వినిపించారట. చరణ్‌కి కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారట. అలా ఈ మూవీ వీళ్లిద్దరి కాంబోలో పట్టాలెక్కిందట. 2021 చివరలో ప్రారంభమైన ఈ సినిమా పలు రకాల కారణాలతో వాయిదా పడుతూ మూడేళ్ల తర్వాత.. 2025 జనవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button