తెలుగు
te తెలుగు en English
Linkin Bioటాలీవుడ్

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మూవీ విడుదల కానుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలోగా నటిస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక, యూఎస్‌తో సహా ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తంచేస్తున్నారు. పుష్ప-2 డైరెక్టర్ సుకుమార్ అయితే ఈ మూవీతో చరణ్‌కి నేషనల్ అవార్డు రావడం పక్కా అని చెబుతున్నారు.

అబ్బాయి కోసం బాబాయ్ వస్తారా?

అయితే, ఈ మూవీకి మరింత బజ్ తీసుకురావడం కోసం యూనిట్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని ఆహ్వానించనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. పవన్ ఇచ్చే డేట్స్‌ని బట్టే ప్రీ రిలీజ్ ఉంటుందని ప్రకటించారు. దీన్ని బట్టి జనవరి 4 లేదా 5 తేదీల్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తన పూర్తి సమయాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకే కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అబ్బాయి మూవీ ప్రమోషన్ కోసం బాబాయ్ వస్తారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button