Game Changer: ‘గేమ్ ఛేంజర్’లో పాట తొలగింపుపై.. ఆడియన్స్ అసంతృప్తి!
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ ఇవాళ విడుదలైంది. అయితే ఈ చిత్రంలో ‘నానా హైరానా’ అంటూ సాగే పాట లేకపోవడంపై రామ్ చరణ్ ఫ్యాన్స్, ఆడియన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పాట యూట్యూబ్‌లో విడుదలై నాటి నుంచి ట్రెండింగ్‌లో నిలిచి కోట్లలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. తీరా సినిమాలో పాట లేకపోవడంతో ఫ్యాన్స్ చాలా డిస్సప్పాయింట్ అయ్యారు. అయితే ఆ పాటపై మూవీ టీం స్పందించింది. ఇన్‌ఫ్రారెడ్ ఇమేజ్‌ల ప్రాసెసింగ్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైన కారణంగా ప్రస్తుతం సాంగ్ ప్రదర్శించలేకపోతున్నామని జనవరి 14 నుంచి ఈ పాటను సినిమాలో జోడిస్తామని స్పష్టంచేసింది.
ఒక్క పాటకే రూ. 10 కోట్లు
ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన ఫస్ట్ ఇండియన్ సాంగ్ ‘నానా హైరానా’ రికార్డు సృష్టించి ‘మెలొడీ ఆఫ్ ది ఇయర్’గా నిలిచింది. న్యూజిలాండ్‌లో 6 రోజుల పాటు దీని షూటింగ్ జరిగింది. ఈ ఒక్క పాట కోసమే దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ పాటలోని విజువల్స్ కూడా ఓ రేంజ్‌లో ఉంటాయని, థియేటర్లలో ఈ సాంగ్ చూసి ఎంజాయ్ చేయొచ్చని ఆడియన్స్ అనుకున్నారు. కానీ వారి ఆశలపై మూవీ టీం నీళ్లు చల్లినట్లైంది. జనవరి 14 కంటే ముందు సినిమా చూసిన వాళ్లకు ఈ పాట చూసే ఛాన్స్ లేనట్టే.