తెలుగు
te తెలుగు en English
Linkin Bioటాలీవుడ్

Game Changer: ‘గేమ్ ఛేంజర్’కి ఊహించని షాకిచ్చిన తెలంగాణ సర్కార్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – యూనివర్సల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ సైతం స్టార్ట్ చేశారు. ఏకంగా డల్లాస్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అయితే విడుదల దగ్గర పడుతున్న సందర్భంలో ఈ సినిమాకు తెలంగాణలో ఊహించని షాక్ తగిలింది. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఇకపై తెలంగాణలో ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని, సినిమా టిక్కెట్స్ రేట్స్ సైతం పెంచుకునేందుకు అనుమతి ఇవ్వబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టంచేశారు. దీంతో ‘గేమ్ ఛేంజర్’ కలక్షన్స్‌పై ఈ ప్రభావం గట్టిగా పడనున్నట్లు తెలుస్తోంది.

సినిమా స్టార్స్‌పై సీఎం ఫైర్

కాగా.. డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ ఘటన జరిగిందని ప్రతిపక్షాలతో సహా ప్రతిఒక్కరూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే బెనిఫిట్ షోలపై ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, అసెంబ్లీ సమావేశాల్లో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సినిమా స్టార్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సినీ హీరోని అరెస్ట్ చేస్తే అందరూ రాద్ధాంతం చేశారని, ఆసుపత్రి చికిత్స పొందుతున్న బాలుడ్ని ఏ సినిమా స్టార్ పరామర్శించలేదని మండిపడ్డారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button