తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Game Changer Trailer: ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ రిలీజ్.. అంచనాలు అందుకుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ విడుదలైంది. డైరెక్టర్ రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అందరూ ఊహించినట్లుగానే ట్రైలర్‌లో డైరెక్టర్ శంకర్ తన మార్క్ చూపించారు. అంచనాలకు అనుగుణంగానే అద్భుతమైన విజువల్స్‌, పాటలతో ఆకట్టుకున్నారు. ‘కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు.. ఒక్క ముద్ద వదిలిపెడితే దానికొచ్చిన నష్టం ఏమీ లేదు, మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు’ అంటూ చెప్పిన డైలాగ్స్, రామ్ నందన్, అప్పన్న పాత్రలలో చరణ్ నటన ఆకట్టుకుంటున్నాయి. ఎస్.జె. సూర్య విలనిజంతో అదరగొట్టారు. తమన్ బీజీఎం కూడా ఆకట్టుకుంటోంది.

జనవరి 10న విడుదల

పొలిటికల్ యాక్షన్ డ్రామాపై తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. కియరా అడ్వాణీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. జనవరి 10న సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా వైడ్‌గా విడుదలకు సిద్ధమైంది. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్లలోనూ దూసుకుపోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button