తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌ డే కలెక్షన్లు ఎంతంటే..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ నిన్న విడుదలై మిక్స్‌డ్ టాక్ ను సొంతం చేసుకుంది. రొటీన్ స్టోరీ, బోరింగ్ నెరేషన్‌తో దర్శకుడు శంకర్ ఆడియన్స్ డిసప్పాయింట్ చేశారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూవీ తొలి రోజు కలెక్షన్లు భారీగా పడిపోతాయని అనుకున్నారు. కానీ ఇంత నెగిటివిటీలోనూ ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ కలెక్షన్లు ఫర్వాలేదనిపించాయి. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. అయితే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ‘దేవర’ తొలిరోజు (రూ. 172 కోట్లు) కలెక్షన్లతో పోల్చితే గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్లు పెరగడం ఆశ్చర్యం కలిగించింది.

రూ. 500 కోట్ల బడ్జెట్!

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రూ. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాలోని పాటలకే రూ. 75 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇక, ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశారు. కియరా అడ్వాణీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. తమిళ నటుడు ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు. శ్రీకాంత్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల, సునీల్ ఇతర పాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ అందించారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button