Hanuman: బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ రూట్‌లో హనుమాన్.. ఖండాంతరాలు దాటుతున్న ‘తెలుగు’ సినిమా ఖ్యాతి!
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ.. చిన్న సినిమాగా వచ్చి ఎన్నో రికార్డులు సృష్టించింది. ‘హనుమాన్’ దెబ్బతో బాక్సాఫీస్ రికార్డులు సైతం బద్దలయ్యాయి. పాన్ ఇండియా సినిమాగా విడదలై ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా మరో ఘనతను సైతం సొంతం చేసుకుంది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు విదేశాల్లోనూ విడుదలై తెలుగోడి సత్తా చాటినట్లు ఇప్పుడు ‘హనుమాన్’ సైతం ఖండాంతరాల్లో కూడా ప్రేక్షకులను అలరించబోతుంతోంది. ఈ చిత్రం జపనీస్ భాషలో కూడా సందడి చేయనుంది. అక్టోబర్ 4న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదలకు సిద్దమవుతోంది.
తెలుగు వెర్షన్ జపనీస్ సబ్ టైటిల్స్‌తో ప్రదర్శన!
ఈ మేరకు.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలియజేస్తూ.. కొత్త పోస్టర్ విడుదల చేశారు. హనుమాన్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత జపాన్‌లో భారతీయ సినిమాలకు.. ప్రత్యేకించి తెలుగు సినిమాలకు సూపర్ క్రేజ్ వచ్చిందని తెలిసిందే. ఇప్పడిదే బాటలో హనుమాన్ కూడా విడుదలవుతూ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. జపాన్‌లోని పలు థియేటర్లలో హనుమాన్ తెలుగు వెర్షన్ జపనీస్ సబ్ టైటిల్స్‌తో స్క్రీనింగ్ కానున్నట్టు సమాచారం. హనుమాన్ ఇన్నాళ్లకు విడుదలవుతూ.. జపనీస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి మరి. ఇక ఈ మూవీలో తేజా సజ్జా, అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు. హనుమాన్ చిత్రానికి గౌరా హరి-అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంయుక్తంగా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు.