తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Heroine Anshu: 23 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ హీరోయిన్..!

నాగార్జున నటించిన ‘మన్మథుడు’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా పాటలు మ్యూజిక్ లవర్స్‌ని ఎంతో ఆకట్టుకుంటాయి. మూవీలో ఫ్లాష్ బ్యాక్‌లో నటించిన హీరోయిన్ అన్షు అంబానీ ఇప్పటికీ చాలా మంది క్రష్ లిస్ట్‌లో ఉంది. ‘గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తోంది’ అన్న పాటలో ఆమె లుక్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ అన్షు తెలుగు సినిమాల్లో కనిపించలేదు.

సందీప్ కిషన్ సినిమాతో..

దాదాపు 23 ఏళ్ల తర్వాత అన్షు టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘మజాకా’ సినిమాలో హీరోయిన్‌గా ఆఫర్ దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అన్షు ఈ సినిమాలో యశోద అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ కూడా షేర్ చేశారు. దీంతో అన్షు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దాదాపుగా 23 సంవత్సరాల తర్వాత తమ ఫెవరెట్ హీరోయిన్ రీ ఎంట్రీ ఇస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button