తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

High Court: బెనిఫిట్ షోలు రద్దంటూ.. స్పెషల్ షోలేంటి..? తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్!

‘గేమ్ ఛేంజ‌ర్’ మూవీ టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ట‌న‌ల దృష్ట్యా ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు అనుమతి ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామని చెబుతూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వ‌డం ఏమిట‌ని మండిపడింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది.

ప్రభుత్వంపై విమర్శలు

కాగా.. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కుర్చీలో ఉన్నంత వరకు రాష్ట్రంలో ప్రత్యేక షోలకు, టిక్కెట్ల రేట్ల పెంపునకు అవకాశం ఉండదని అన్నారు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం అసెంబ్లీలో మాట్లాడుతూ ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు ఉండవన్నారు. కానీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button