తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Jai Hanuman: సర్‌ప్రైజ్ వచ్చేసింది.. ‘జై హనుమాన్‌’లో రిషభ్ శెట్టి!

‘జై హనుమాన్’ మూవీలో హీరో ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది. దీపావళి సందర్భంగా మూవీ టీం సర్‌ప్రైజ్‌ను రివీల్ చేసింది. ఇందులో హనుమాన్ పాత్రలో కన్నడ స్టార్ రిషభ్ శెట్టి నటించనున్నారు. సోషల్‌ మీడియా వేదికగా రిషభ్ శెట్టి ఫస్ట్‌ లుక్‌‌ను మేకర్స్ తాజాగా రిలీజ్‌ చేశారు. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్‌’ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. దానికి కొనసాగింపుగా రూపొందుతున్నదే ‘జై హనుమాన్‌’.

భారీ అంచనాలు!

‘జై హనుమాన్’ మూవీ ‘హనుమాన్‌’కి మించి ఉంటుందని, ఆంజనేయస్వామి పాత్రను స్టార్ హీరోగా పోషిస్తారని ప్రశాంత్‌ వర్మ చెప్పిన క్షణం నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో పలువురి అగ్ర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ అవకాశం చివరకు రిషభ్ శెట్టికి దక్కింది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటన్నది ఈ సీక్వెల్‌లో కీలకాంశం. ‘హనుమాన్‌’లో హనుమంతుగా కనిపించిన తేజ కొత్త సినిమాలోనూ అదే పాత్ర పోషించనున్నారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button