తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Johnny Master: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై పోలీసులకు ఫిర్యాదు!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో బాధితురాలిపై ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. జానీ మాస్టర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన యువతిపై నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె తనపై లైంగిక వేధింపులకు పాల్పడిందని నెల్లూరు పోలీసులకు జానీ మాస్టర్‌ అల్లుడు షమీర్‌ ఫిర్యాదు చేశారు.. ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు. తన మామ జానీతో కలిసి హైదరాబాద్, చెన్నైలలో సినిమా షూటింగులకు వెళ్లేవాడినని.. తనను ఆ యువతి లైంగికంగా వేధించిందని షమీర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంచలన ఆరోపణలు

తనపై లిఫ్టులు, షూటింగ్‌లో విశ్రాంతి తీసుకునే వాహనం, లాడ్జి గదుల్లో ఇలా తనపై లైంగికంగా దాడి చేసిందని ఫిర్యాదులో ప్రస్తావించారు. లాడ్జి గదిలో లైంగికంగా దాడి చేయడంతో పాటు తనను నగ్నంగా ఫోటోలు తీసిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫోటోలు అందరికీ పంపుతానని బెదిరించిందని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని షమీర్ పోలీసుల్ని కోరారు. అతడి నుంచి ఫిర్యాదు స్వీకరించిన నెల్లూరు పోలీసులు.. కేసు ఇంకా నమోదు చేయలేదు. జానీ మాస్టర్ కేసులో ఈ ట్విస్ట్ సంచలనంగా మారింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button