తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Johnny Master: సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న జానీ మాస్టర్ ఎమోషనల్‌ పోస్ట్‌!

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో అరెస్టై 37 రోజులు చంచల్‌గూడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. జైలు నుంచి ఇంటి తిరిగొచ్చిన సమయంలో కుటుంబ సభ్యుల స్పందనకు సంబంధించిన వీడియోను జానీ మాస్టర్ సోషల్ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

మీ ప్రార్థనల వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నా!

‘నా కుటుంబం, శ్రేయోభిలాషుల ప్రార్థనల వల్ల ఈ రోజు ఇక్కడ ఉన్నా. నిజం అనేది ఏదో ఓ రోజు తప్పక బయటపడుతుంది. నా ఫ్యామిలీ పడిన కష్టం.. ఎప్పటికీ నన్ను వేదనకు గురిచేస్తూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు. అత్యాచారం కేసులో గత నెల 19న జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్టు చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మొదట రంగారెడ్డి పోక్సో న్యాయస్థానంలో బెయిల్‌ కోసం ఆయన ప్రయత్నించగా అనుమతి లభించలేదు. మరో పిటిషన్‌తో ఆయనకు గురువారం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదవడంతో ఆయనకు ప్రకటించిన జాతీయ అవార్డును నిలిపివేస్తున్నట్లు అవార్డుల కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button