తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Johnny Master: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. నేరం ఒప్పుకున్న జానీ మాస్టర్!

గత రెండు, మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు కొత్త మలుపు తిరిగింది. తనను జానీ మాస్టర్ రేప్ చేశాడంటూ ఆయన వద్ద పని చేసిన ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే జానీ మాస్టర్ ని పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేయగా హైదరాబాద్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక తాజాగా జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.

2019లో పరిచయం..

‘2019లో జానీ మాస్టర్‌కు బాధితురాలు పరిచయమైంది. దురుద్దేశంతోనే ఆమెను తన అసిస్టెంట్ గా చేర్చుకున్నాడు. 2020లో ముంబైలోని హోటల్ లో లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు. గత నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడు. సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. తనకున్న పలుకుబడితో ఆమెకు అవకాశాలు రాకుండా చేశాడు. జానీ భార్య కూడా బాధితురాలని బెదిరించింది’ అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button