తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Johnny Master: ఇది సరైన నిర్ణయం కాదు..! జానీ మాస్టర్‌కు అవార్డు నిలిపివేతపై స్పందించిన డ్యాన్స్ మాస్టర్లు!

అసిస్టెంట్ డ్యాన్సర్‌పై అత్యాచారం కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఊహించని షాక్ తగిలింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక నేషనల్ అవార్డు (తిరు చిత్రానికి గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు)ను అవార్డుల కమిటీ నిలిపివేసింది. జానీ మాస్టర్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అవార్డుల కమిటీ పేర్కొంది. జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డును నిలిపివేయడం సరైన చర్య కాదంటూ పలువురు కొరియోగ్రాఫర్లు ధైర్యంగా ముందుకు వస్తున్నారు.

ఇది చాలా అన్యాయం!

ఈ అంశంపై కొరియోగ్రాఫర్ ఆట సందీప్ దంపతులు సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ‘జానీ మాస్టర్‌కు అవార్డు రద్దు నిర్ణయం సరైందని కాదు. ఇలా చేయడం చాలా అన్యాయం. చిన్న స్థాయి నుంచి ఎంతో కష్టపడి జాతీయ స్థాయిలో ఎదిగి.. అవార్డు సాధించడం అంటే మామూలు విషయం కాదు. జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన అమ్మాయి నా వద్ద కూడా కొన్ని ఈవెంట్లకు పని చేసింది. ‘నేను జానీ మాస్టర్ వద్దే పని చేస్తున్నాను. ఆయన వద్దే ఉంటాను. నేను వేరే మాస్టర్ల వద్ద పని చేయను అని ఆమె నాతో చెప్పింది. ఎంత కంఫర్ట్ లెవెల్ ఉంటే అలా మాట్లాడుతుంది. ఇప్పుడున్న చట్టాలు సైతం అమ్మాయిలకే అనుకూలంగా ఉన్నాయి’ అని అన్నారు. కొన్ని రోజుల క్రితం ఇదే అంశంపై మాట్లాడిన ఆట సందీప్ భార్య, కొరియోగ్రాఫర్ జ్యోతి రాజ్ కూడా జానీ మాస్టర్‌ను కుట్రపూరితంగానే, కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఇక, తాజా వీడియోపై లేడీ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ కూడా స్పందించారు. ‘ఫైనల్‌గా ఒకరు బయటకు వచ్చి మాట్లాడారు.. నా మనసులో కూడా ఇదే ఉంది.. చివరకు మీరు చెప్పారు.. థాంక్ గాడ్ అంటూ’ అంటూ కామెంట్స్ చేశారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button