Kalki 2: ‘కల్కి – 2’పై షూటింగ్ అప్డేట్.. నిర్మాతలు కీలక వ్యాఖ్యలు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. దీనికి కొనసాగింపుగా రానున్న ‘కల్కి 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అప్డేట్స్ తెలుసుకునేందుకు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గోవాలో జరుగుతోన్న ‘ఇఫ్ఫీ’ వేడుకల్లో ఈ మూవీ నిర్మాతలు స్వప్న- ప్రియాంక కీలక వ్యాఖ్యలు చేశారు.
35 శాతం షూటింగ్ పూర్తి!
‘పార్ట్ 2కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రెగ్యులర్ షూట్ ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అన్ని సిద్ధమయ్యాక ప్రకటిస్తాం. ‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణె.. పార్ట్ 2లోనూ కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపించనున్నారు’ అని చెప్పారు. ‘కల్కి 2898 ఏడీ’తో పాటే సీక్వెల్‌కు సంబంధించిన షూట్‌ను కొంతమేర తీసినట్లు చెప్పారు. పార్ట్ 2కు సంబంధించి 35 శాతం షూట్ జరిగిందని వివరించారు.