Kalki: ప్రభాస్ ‘కల్కి’కి అరుదైన అవకాశం.. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శన!
Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ భారత సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్నో సరికొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘కల్కి’ సినిమా మరో అరుదైన అవకాశాన్ని కూడా సొంతం చేసుకుంది. 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కల్కి’ ఓపెన్ సినిమా విభాగంలో ఈ ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈ ఏడాది 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అక్టోబరు 2 నుంచి 11 వరకు జరగనుంది. బీఐఎఫ్‌ఎఫ్‌లోని అతిపెద్ద బహిరంగ థియేటర్‌లో ‘కల్కి’ని అక్టోబరు 8, 9 తేదీల్లో ప్రదర్శించనున్నారు.
ALSO READ: పవన్ కళ్యాణ్‌ను వదలని ప్రకాశ్ రాజ్.. చేయని తప్పుకు సారీ ఏంటీ..?
గత జూన్ 27న విడుదలైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. మహాభారత కాలాన్ని.. భవిష్యత్తును మేళవించి తెరకెక్కించిన ఈ సినిమా రూ.1,200 కోట్లకు పైగా వసూలు చేసింది. అగ్ర నటులు అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామగా, కమల్ హాసన్.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్, ఆయన టీమ్ పార్ట్-2 స్క్రిప్ట్‌ను పూర్తి చేసేపనిలో ఉంది.