తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Kalki: ‘కల్కి-2’ మూవీ గురించి నిర్మాత ఆసక్తికర అప్డేట్స్!

నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించిందో చూశాం. గతేడాది రిలీజైన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇటీవల జపాన్‌లోనూ ఈ సినిమా విడుదలై గుర్తింపు తెచ్చుకుంది. ఇక, ఈ మూవీకి సీక్వెల్‌గా ‘కల్కి-2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే, కల్కి-2కి సంబంధించి నిర్మాత అశ్వినీదత్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అప్డేట్స్ పంచుకున్నారు. కల్కి-2 విడుదల, పాత్రల గురించి వెల్లడించారు.

వచ్చే ఏడాది విడుదల..!

‘రెండో పార్ట్‌‌లో ప్రభాస్‌ – కమల్‌ హాసన్‌ల మధ్య సన్నివేశాలే ఎక్కువగా ఉంటాయి. అమితాబ్‌ బచ్చన్‌ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఈ మూడు పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్లే ఆ సినిమాకు మెయిన్‌. వీళ్లతో పాటు దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్‌లో కొత్త వాళ్లు ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుంది.’ అని అన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button