తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Kalki: విడుదలై 11 రోజులైనా.. తగ్గేదేలేదంటున్న ‘కల్కి 2898’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన మూవీ ‘కల్కి 2898 ఏడి’. బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రలో నటించారు. పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. 600 కోట్లతో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది ఈ మూవీ జూన్ 27 విడుదలై తొలి రోజే రూ. 191 కోట్లకు పైగా కొల్లగొట్టింది. రిలీజ్ అయినా నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి ఎన్నో రికార్డ్స్ తన పేరున నమోదు చేసింది. ఇక వారం గడిచేలోగా రూ.700కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే సక్సెస్ ఫుల్‌గా రెండో వారంలోకి దూసుకు వచ్చిన ఈ మూవీకి కలెక్షన్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు. రెండు వారాలు గడవకుండానే ఈ మూవీ వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతుంది.

ALSO READ: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఆనందంలో జట్టు సభ్యులు

సెకండ్ వీకెండ్ కూడా కాసుల వర్షం కురిపించింది. ఈ శనివారం, ఆదివారం కూడా ఈ సినిమాకు ప్రేక్షాకదరణ బాగా దక్కింది. మూవీ రిలీజ్ అయ్యి 11 రోజులు కావొస్తున్నా అన్ని ఏరియాల్లో బుకింగ్‌లు అద్భుతంగా ఉన్నాయి. కొన్ని థియేటర్స్ లో ఇంకా హౌసుఫుల్ షోలు పడుతున్నాయి. ఈ పదకొండు రోజుల్లో రూ. 900 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఇదే విధంగా కొనసాగితే.. ఈ వారంలోనే రూ.1000 కోట్లు క్లబ్ లోకి చేరడంలో ఎటువంటి సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button