తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Kannappa: జూన్ 14న ‘కన్నప్ప’ టీజర్ రిలీజ్

ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఆవా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి మంచు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ లభించింది. జూన్ 14న ‘కన్నప్ప’ టీజర్ రాబోతోందని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్‌ అందరిలోనూ మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. గుర్రం మీద విష్ణు కూర్చున్న తీరు, చుట్టూ కనిపిస్తున్న అటవీ ప్రాంతాన్ని చూస్తుంటే సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాన్ని చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగేలా ఉంది.

ALSO READ: అక్షరయోధుడు రామోజీరావు అస్తమయం

ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మోహన్ బాబు వంటి పాన్ ఇండియా స్టార్స్ నటిస్తున్నారు. దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక రీసెంట్‌గా ప్రభాస్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయినట్లు మేకర్స్ ప్రకటించగా ఆ న్యూస్ బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button