తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Karni Sena: వివాదంలో పుష్ప-2.. నిర్మాతలపై దాడి చేద్దామంటూ పిలుపు!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్లు వసూళ్లు చేసి రికార్డులు సృష్టిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. పుష్ప-2లో క్షత్రియ కమ్యూనిటీని అవమానించారని, నిర్మాతలపై దాడులు చేయాలని కర్ణిసేన నాయకుడు రాజా షెకావత్ పిలుపునిచ్చారు.

ఎంతకైనా తెగిస్తాం!

‘పుష్ప-2’లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను నెగిటివ్‌గా చూపించారని, అది ‘క్షత్రియ’ కమ్యూనిటీని కించపరిడమేనని రాజా షెకావత్ అన్నారు. సినిమాలో ‘షెకావత్’ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం వల్ల సమాజాన్ని అవమానించారని ఆరోపించారు. నిర్మాతలు ఈ పదాన్ని సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో క్షత్రియులను అవమానిస్తున్న ఈ పరిశ్రమ మళ్లీ అదే పని చేసింది. సినిమా నిర్మాతలు ‘షెకావత్’ అనే పదాన్ని సినిమా నుంచి తొలగించాలి, లేకుంటే కర్ణి సేన.. నిర్మాతలపై దాడి చేస్తుంది. అవసరమైతే ఎంతకైనా తెగిస్తుంది’ అని వీడియోలో పేర్కొన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button