తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Keerthi Suresh: రిలేషన్‌‌షిప్‌పై హీరోయిన్ కీర్తి సురేశ్‌ అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

గత కొన్ని రోజులుగా తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు హీరోయిన్ కీర్తి సురేశ్ తెర దించారు. ఆమె రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి కీర్తి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. బాయ్ ఫ్రెండ్ ఆంటోనీతో కలిసి దిగిన ఫొటోని ఆమె ఇన్‌స్టాలో పంచుకున్నారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేస్తూ దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని తెలిపారు.

కాలేజీ నుంచే స్నేహం!

కాగా.. కీర్తి సురేశ్ ‘నేను శైలజ’తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే తెలుగులో ఘన విజయం అందుకున్నారు. అనంతరం ఆమె తెలుగుతోపాటు, తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేశారు. ‘మహానటి’తో విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఉత్తమ నటిగా జాతీయ అవార్డునూ అందుకున్నారు. కెరీర్‌ పరంగా వరుస సినిమాల్లో నటిస్తోన్న ఆమె త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. తన స్నేహితుడు ఆంటోనీతో ఆమె ఏడడుగులు వేయనున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంజినీరింగ్‌ చదివిన ఆంటోనీ కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేశాడని.. ప్రస్తుతం అతనికి కేరళలో పలు వ్యాపారాలు ఉన్నాయని టాక్‌. కాలేజీ రోజుల నుంచి కీర్తి – ఆంటోనీ స్నేహితులట. పెద్దల అంగీకారంతోనే వీరి పెళ్లి జరుగుతోందట.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button