Keerthi Suresh: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ‘మహానటి’.. వరుడు ఎవరో తెలుసా?
సౌత్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్. అయితే ఈ చెన్నై బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు కీర్తి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా? ఆమె దగ్గరి బంధువేనట. తల్లిదండ్రులు చూసిన సంబంధానికే కీర్తి ఓకే చెప్పేశారట. దీంతో డిసెంబర్ లో వీరి పెళ్లి జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గోవాలో సన్నిహితులు, కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ కు దూరంగా..!
అయితే, కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్‌కు కాస్త దూరంగానే ఉంటున్నారు. ఇక్కడ వరుసగా ఫ్లాపులు వచ్చేశాయి. కోలీవుడ్, బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తుండటంతో ఈ భామ తన దృష్టిని అటు వైపే పెడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో అంటే ‘దసరా’ ఒక్కటే కీర్తి సురేశ్‌కు చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. మహేశ్ సరసన నటించిన ‘గుంటూరు కారం’ మూవీ సైతం యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.