Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘క’ మూవీకి సీక్వెల్‌గా ‘క 2’!
చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన మూవీ ‘క’. హీరో కిరణ్ అబ్బవరం చెప్పి మరి హిట్ కొట్టారు. ఈ నేపథ్యంలో మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ థాంక్స్ మీట్‌లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘క’ చిత్రానికి సీక్వెల్‌గా ‘క 2’ ఉంటుందన్నారు. అంతేకాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భావోద్వేగంగా మాట్లాడంపైనా ఆయన స్పందించారు.
బాధతోనే మాట్లాడాను..!
‘మా చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంతటి విజయాన్ని ఊహించలేదు. ప్రేక్షకులు నన్ను తమ ఇంటి వ్యక్తిలా భావించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ విధంగా ఎమోషనల్ స్పీచ్ ఇవ్వాలనుకోలేదు. మా అమ్మ, ఆమె పడిన కష్టం గురించి చెప్పాలనుకున్నా. గత ఏడాదిగా పడిన మాటల వల్ల వచ్చిన బాధతో అలా మాట్లాడా. అంతేకానీ ఇతరులను ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేయలేదు. తక్కువ చేసి మాట్లాడలేదు. బాధను మాత్రమే పంచుకున్నా. తమ రాష్ట్రంలోనూ షోలు వేయమని చెన్నై నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తమిళంలో కాకపోయినా.. తెలుగు వెర్షన్ అయినా వీలుంటే ఐదు షోలు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘క 2’ త్వరలోనే అనౌన్స్ చేస్తాం. కృష్ణగిరిలో మూడు గంటలకే చీకటి పడుతుందని ‘క’లో చూపించాం. అలా ఎందుకు జరుగుతుంది? దానివల్ల జరిగే పరిణామాలు ఏమిటి? వంటి ఆసక్తికర అంశాలతో పార్ట్ 2 ఉంటుంది.’ అని అన్నారు.