తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Kiran Abbavaram: తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నారు. ‘మా ప్రేమ రెండడుగుల మేర పెరుగుతోంది’ అంటూ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఆయన భార్య రహస్య గోరఖ్ ఫోటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఈ జంటకు విషెస్ చెబుతున్నారు.

స్నేహం నుంచి ప్రేమగా..!

గతేడాది ఆగస్టులో తన ప్రేయసి రహస్య గోరఖ్‌ని కిరణ్ అబ్బవరం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కిరణ్ మొదటి సినిమా ‘రాజావారు రాణిగారు’లో రహస్య గోరఖ్ హీరోయిన్‌గా నటించారు. అప్పుడే ఇరువురి మధ్య స్నేహం చిగురించింది. దాదాపు నాలుగేళ్ల పాటు కొనసాగిన వీరి ప్రేమ ప్రయాణం గతేడాది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంగా మారింది. ఇక.. సినిమాల పరంగా చూస్తే ‘క’తో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విశ్వకరుణ్‌ దర్శకత్వంలో ‘దిల్‌ రూబా’ అనే మూవీలో నటిస్తున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button