Mahesh Babu: ప్రశాంత్ వర్మ కథ.. శ్రీకృష్ణుడి పాత్రలో మహేశ్ బాబు?
మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దీనికి కథ అందించారు. నవంబర్ 14న ఇది విడుదల కానుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో మహేశ్‌బాబు అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. క్లైమాక్స్‌లో శ్రీ కృష్ణుడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉంటాయని.. అందులో మహేశ్ నటిస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందని తెలుస్తోంది. ఈ మేరకు చిత్రబృందం మహేశ్‌ను ఒప్పించి షూట్ చేశారని టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
యాక్షన్ ఎంటర్‌టైనర్
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి అర్జున్ జంధ్యాల దర్శకత్వంతో ‘దేవకీ నందన వాసుదేవ’ సిద్ధమవుతోంది. మానస వారణాసి కథానాయిక. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ‘ఆధ్యాత్మిక అంశాలతో నిండిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. దీంట్లో అశోక్ మాస్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు’ అని చిత్ర వర్గాలు ఇది వరకే తెలిపాయి.