తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Mahesh Babu: మీరు కూడా నాతో పాటు చేరండి.. మెన్స్‌ డే రోజు మహేశ్‌ బాబు స్పెషల్‌ పోస్ట్‌!

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. సినిమాల్లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో, సామాజిక కార్యక్రమాల్లోనూ అంతే యాక్టివ్‌గా ఉంటారు. ఇప్పటికే తన ఫౌండేషన్ ద్వారా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఎంతో మంది నిరుపేద చిన్నారులకు ఆపరేషన్లు చేయిస్తూ వారి తల్లిదండ్రుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. తాజాగా లింగ సమానత్వంపై ప్రచారంలో మహేశ్ బాబు భాగమయ్యారు.

మీరూ చేరండి!

మహిళలపై అత్యాచారాలు, వివక్షకు వ్యతిరేకంగా నిలవడం, లింగ సమానత్వం కోసం ఏర్పాటు చేసిన ‘మార్డ్‌’ (మెన్ అగెనిస్ట్ రేప్ అండ్ డిస్‌క్రిమినేషన్) అనే సామాజిక కార్యక్రమంలో మహేశ్‌ బాబు భాగస్వామి అయ్యారు. మార్డ్‌ ప్రచారం కోసం బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌తో మన సూపర్‌ స్టార్‌ చేతులు కలిపారు. తాను మార్డ్‌లో భాగమైనట్లు తెలుపుతూ పోస్ట్‌ పెట్టారు. ‘గౌరవం, సానుభూతి మనిషికి ఉండాల్సిన నిజమైన లక్షణాలు. సమానత్వం కోసం నిలబడండి. ప్రతి పనిలోనూ దయను చూసేవాడు అసలైన పురుషుడు. ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నాడు నాతో పాటు మీరూ మార్డ్‌లో చేరండి’ అని పేర్కొన్నారు. క మహేశ్‌తో పాటు క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌, యువరాజ్‌ సింగ్‌, నటుడు ఫర్హాన్‌ అక్తర్‌, గాయకుడు షాన్‌ ఈ ప్రచారంలో భాగమయ్యారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button