తెలుగు
te తెలుగు en English
Linkin Bioటాలీవుడ్

Manchu Family War: ‘మంచు’లా కరిగిపోయిన ‘మంచు’ కుటుంబం పరువు!

నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడుకోవాల్సిన ఇష్యూని బజారులో పెట్టేశారు. కుటుంబ సభ్యులు మాత్రమే తేల్చుకోవాల్సిన వ్యవహారాన్ని పబ్లిక్‌లోకి లాగేశారు. రచ్చ రచ్చ చేసుకున్నారు. అటు తిరిగి.. ఇటు తిరిగి.. చివరకు జర్నలిస్టులపైనా దాడి చేశారు. ముందే సినిమా వాళ్లు.. పైగా దాడి.. మరి జర్నలిస్టులు ఊరుకుంటారా? అసలు ‘మంచు’ కుటుంబానికి ఏమైంది? క్రమశిక్షణకు మారుపేరులా నిలిచిన ‘మంచు’ కుటుంబం పరువు చివరకు ‘మంచు’లా ఎందుకు కరిగిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మోహన్ బాబు ఇంట్లో పరిష్కారం దొరుకుతుందని అందరూ చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ ఇంట్లోనే సమస్య! మరి ఆ సమస్యకు పరిష్కారం ఎవరు చూపిస్తారు?

సాయంత్రం అన్నీ చెప్పేస్తా: మనోజ్

మంచు మోహన్ బాబు – మనోజ్ కుమార్‌ల మధ్య గొడవ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ అదే హాట్ టాపిక్. ఇద్దరి మధ్య ఘర్షణ కాస్త.. జర్నలిస్టుపై దాడితో వేరే ట్రాక్ తీసుకుంది. దీంతో మోహన్ బాబుపై కేసు కూడా నమోదైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులందరూ ఆందోళలనకు దిగారు. మోహన్ బాబు – మనోజ్ కుమార్.. ఇద్దరి మధ్య గొడవకు అసలు కారణం తెలియక ముందే సీన్ ‘చిరిగిపోయింది’. ఇంట్లో పనివాళ్లతో వచ్చిన గొడవో? లేదా ఆస్తి కోసం అన్నదమ్ముల ప్రాకులాటో, లేక మోహన్ బాబు చెబుతున్నట్టు కోడలు పెట్టిన చిచ్చో తెలీదు కానీ ఇన్నాళ్లుగా కాపాడుకున్న ‘మంచు’ కుటుంబం గౌరవ, మర్యాదలన్నీ ఉన్నట్టుండి ఒక్కసారిగా నేలకూలిపోయాయి. ఇక, ఇవాళ సాయంత్రం మీడియా సమావేశం పెట్టి అన్నీ చెప్పేస్తానంటున్న మనోజ్.. ఇంకా ఎలాంటి బాంబులు పేలుస్తారో..? ఈ ఇష్యూ ఇంకా ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button