తెలుగు
te తెలుగు en English
Linkin Bioటాలీవుడ్

Manchu Family War: ‘మంచు’ ఫ్యామిలీ గొడవల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు వినయ్.. ఇంతకీ ఎవరీయన?

‘మంచు’ కుటుంబ వివాదం రోజుకో ట్విస్ట్‌తో.. ప్రతి రోజు హాట్ టాపిక్‌గానే ఉంటోంది. జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు తాజాగా మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు నిన్న రాచకొండ సీపీ ఆఫీసుకి వెళ్లిన మంచు విష్ణుకు కమిషనర్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కీలక చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇదంతా పక్కన పెడితే.. మోహన్ బాబు – మనోజ్‌ల మధ్య వివాదం చెలరేగినప్పటి నుంచి ఒక పేరైతే ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన వల్లే తండ్రీకొడులకు, అన్నాదమ్ములకు మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు కూడా వస్తున్నాయి. మనోజ్ సైతం తాను రాసిన లేఖలో ఆయన పేరును పేర్కొనడం గమనార్హం. ఆ పేరే వినయ్ మహేశ్వరి.. ఇంతకీ ఈయన ఎవరు? మంచు ఫ్యామిలీకి, వినయ్‌కి సంబంధం ఏమిటి?

ఆయన వల్లేనా?

ఇంతకీ ఈ వినయ్ ఎవరో కాదు, మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అంతేకాదు, మంచు కుటుంబానికి చెందిన న్యూయార్క్ అకాడమీ, శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ సంస్థల సీఈవో కూడా. అంతకు ముందు పలు మీడియా సంస్థల్లోనూ ఆయన పనిచేశారు. వినయ్ మంచు విష్ణుకి అత్యంత సన్నిహితుడు. విష్ణు, మనోజ్‌ల మధ్య కొన్ని రోజులగా మాటలు లేవని, తమ్ముడికి తాను చెప్పాలనుకున్న విషయాన్ని వినయ్ మహేశ్వరి ద్వారా విష్ణు తెలియజేస్తారని టాక్. విష్ణు దగ్గరకు వినయ్ మహేశ్వరి వచ్చినప్పటి నుంచి మంచు ఫ్యామిలీలో గొడవలు మొదలు అయ్యాయని మనోజ్ సన్నిహితులు ఆరోపణలు చేస్తున్నారు. కొంతకాలం క్రితం మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఫీజుల అక్రమాలపై వినయ్‌ని కలవడానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నాయకులని కలవడానికి అతను నిరాకరించారు. అప్పుడు స్వయంగా మంచు మనోజ్ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతు ఇస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అప్పటినుండి ఈ వివాదం మరింత ముదిరినట్టుగా తెలుస్తుంది. మంచు కుటుంబంలో తాజాగా జరిగిన ఆస్తుల గొడవలో సైతం వినయ్ మహేశ్వర్ మీద మనోజ్ చేయి చేసుకున్నారని, ఆ తర్వాత జరిగిన తోపులాటలో మనోజ్‌కు గాయాలు అయ్యాయని తెలుస్తోంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button