తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Manchu Vishnu: మంచు విష్ణు కీలక ప్రకటన.. ‘కన్నప్ప’లో ప్రభాస్ లుక్ లీక్ చేసిన వారిని పట్టుకుంటే రూ. 5 లక్షలు!

‘క‌న్న‌ప్ప’ మూవీ నుంచి ప్రభాస్ లుక్ లీకైన ఘటనపై హీరో మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు.లీక్ చేసిన వారిని ప‌ట్టిస్తే ఐదు ల‌క్ష‌లు ఈ లుక్ లీక్‌పై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. లీకు దొంగ‌ల‌పై పోలీస్ కేసు పెట్ట‌బోతున్నట్లు తెలిపారు. అంతేకాదు, లుక్ లీక్ చేసిన దొంగను పట్టుకుంటే రూ. 5 లక్షలు బ‌హుమానంగా అంద‌జేస్తామ‌ని ప్రకటించారు.

మా ఐదేళ్ల కష్టం!

‘క‌న్న‌ప్ప కోసం గ‌త ఎనిమిది సంవ‌త్స‌రాలుగా మేం మా హృద‌యాల‌ను, ప్రాణాల‌ను అర్పించాం. గ‌త రెండు సంవ‌త్స‌రాలు నిబ‌ద్ధ‌త‌తో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేయ‌డానికి మా టీమ్ నిరంత‌రం కృషి చేస్తోంది. ఇలాంటి క్ష‌ణంలో క‌న్న‌ప్ప సినిమా నుంచి వ‌ర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇమేజ్ అన‌ధికారికంగా లీక్ అయినందుకు చాలా బాధ‌ప‌డుతున్నాం. ఈ లీక్ మా క‌ష్టాన్ని మాత్ర‌మే కాకుండా సినిమా కోసం నిరంత‌రం కృషి చేస్తోన్న 2000 మంది వీఎఫ్ఎక్స్ క‌ళాకారుల జీవితాల‌ను కూడా ప్ర‌భావితం చేస్తోంది. ఈ లీక్‌డ్ ఇమేజ్ షేర్ చేయ‌డం ద్వారా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు గురికావాల్సి ఉంటుంది. ఈ లీక్ చేసిన వారిని ఎవ‌రైనా క‌నుగొంటే వారికి ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు బ‌హుమానంగా అంద‌జేస్తాం. వారి వివ‌రాల్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ ‘ఎక్స్’ అకౌంట్‌కు డైరెక్ట్‌గా మెసేజ్ పంపండి’ అంటూ ప్రకటించారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button