తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Manchu Vishnu: అదే మా నాన్న చేసిన తప్పు.. మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు!

మంచు కుటుంబంలో నెలకొన్న వివాదంపై హీరో మంచు విష్ణు స్పందించారు. మోహన్ బాబు చికిత్స పొందుతున్న కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న జరిగిన దాడిలో ఒక విలేకరికి గాయాలవడం దురదృష్టకరం అన్నారు. అతని కుటుంబంతో మాట్లాడామని.. అవసరమైన సాయం చేస్తామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సెన్సేషన్‌ చేయొద్దని అన్నారు.

దీన్ని ఇంతటితో వదిలేయండి!

‘మాది ఉమ్మడి కుటుంబం. మేం కలిసిమెలిసి ఉంటామని అనుకున్నా. దురదృష్టవశాత్తూ ఇలా జరిగింది. ఈ వివాదం మా మనసులను ఎంతో బాధపెడుతోంది. ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నా. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే నాన్న చేసిన తప్పు. ప్రతీ కుటుంబంలోనూ ఇలాంటి గొడవలు ఉంటాయి. కాబట్టి, ఈ విషయాన్ని సెన్సేషన్‌ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది. ప్రజల్లోకి తీసుకువెళ్లడం కరెక్టే కానీ, కొంతమంది హద్దులు మీరి వ్యవహరిస్తున్నారు. ఈరోజు అమ్మ ఆస్పత్రిలో చేరారు. ఇంటికి పెద్ద కుమారుడిగా నేను చాలా బాధపడుతున్నా. నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి. మీడియా వాళ్లకు నాది ఒకటే విజ్ఞప్తి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. మా జీవితాలను సర్కస్‌ చేయకండి. నేను సీపీని కలుస్తాను. చట్టపరంగా దీనిపై పోరాటం చేస్తా.’ అని అన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button