తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Manchu Vishnu: అడవి పందుల వేట.. మరో వివాదంలో ‘మంచు’ ఫ్యామిలీ!

‘మంచు’ కుటుంబం మరోసారి వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ శివారు జల్‌పల్లిలోని అటవీ ప్రాంతంలో మంచు విష్ణు మేనేజర్ కిరణ్ అడవి పందులను వేటాడాడు. ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లాడు. విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడి బంధించి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అడవి పందులను వేటాడిన విష్ణు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయంపై మంచు విష్ణు ఇంకా స్పందించలేదు.

మళ్లీ వార్తల్లోకి!

కాగా.. ఇటీవల కొన్ని రోజుల ముందు కూడా మంచు ఫ్యామిలీ వివాదంలో నిలిచింది. మోహన్ బాబు, మనోజ్ కుమార్‌ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటన అటు తిరిగి ఇటు తిరిగి మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేసే దాకా వెళ్లింది. ప్రస్తుతం ఈ కేసులో హైకోర్టు పరిధిలో ఉంది. మనోజ్ ఇంట్లో విష్ణు కరెంట్ నిలిపివేయడం వంటి అంశాలతో దాదాపు 10 రోజుల పాటు మంచు ఫ్యామిలీ ఇష్యూ మీడియాలో ట్రెండింగ్‎లో నిలిచింది. మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం కాస్త సద్దుమణిగిందనుకునే లోపే.. మరోసారి ఈ ఘటనతో వార్తల్లోకెక్కింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button