తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Matka: ఆశలన్నీ ‘మట్కా’పైనే.. ఈసారైనా హిట్ కొట్టేనా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. పలాస, శ్రీదేవి సోడాసెంటర్ వంటి సినిమాలు తెరకెక్కించిన కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ‘మట్కా’ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. దీంతో మూవీపై మరన్ని అంచనాలు పెరిగాయి.

సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా?

వరుణ్ తేజ్‌కు ఈ సినిమా ఎంతో కీలకం. ఈ యంగ్ హీరో గత కొన్నేళ్లుగా వరుస ప్లాప్స్‌తో సతమతమవుతున్నాడు. 2019లో వచ్చిన గద్దల కొండ గణేష్ తర్వాత ఆరేంజ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు వరుణ్ తేజ్. మధ్యలో వచ్చిన గని, గాండీవధారి అర్జున భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. మరోసారి తనకు లాస్ట్ హిట్ ఇచ్చిన యదార్ధ సంఘటనల ఆధారంగా వస్తున్న మాస్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నాడు వరుజ్. ఈ నెల 14న కంగువాతో పోటీగా రిలీజ్ అవుతున్న ‘మట్కా’ వరుణ్ తేజ్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తోందో లేదో మరికొద్ది రోజుల్లో తేలుతుంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button