Matka: మెగా అభిమానులకు ప్రామిస్ చేసిన ‘మట్కా’ డైరెక్టర్..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ‘మట్కా’ ట్రైలర్ ని లాంచ్ చేశారు.
వరుసగా సర్‌ప్రైజెస్!
ఈ సందర్భంగా డైరెక్టర్ కరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మెగా అభిమానులందరికీ నేను ఒక ప్రామిస్ చేదల్చుకున్నాను. వరుణ్ బాబుని మీరు ఎలా చూద్దామనుకుంటున్నారో, ఇలాంటి సినిమాలో చూద్దాం అనుకుంటున్నారో, ఆ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. ఆయనలో ఉన్న నటుడు, ఆయనలోని యాక్షన్ హీరో.. అన్ని కోణాల్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. ఈరోజు నుంచి ఈ సినిమా నుంచి ఒక్కొక్క సర్ప్రైజ్ వదులుతుంటాం.’ అని అన్నారు.